Cocktail 2: బాలీవుడ్‌లో రష్మిక సంచలన ప్రయోగం.. వైరలవుతోన్న న్యూస్‌!

Cocktail 2: వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక ప్రయోగాత్మక పాత్రకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Update: 2026-02-20 07:19 GMT

Cocktail 2: బాలీవుడ్‌లో రష్మిక సంచలన ప్రయోగం.. వైరలవుతోన్న న్యూస్‌!

Cocktail 2: వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక ప్రయోగాత్మక పాత్రకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికర చిత్రం ‘కాక్‌టెయిల్ 2’ (Cocktail 2)లో రష్మిక, కృతి సనన్ నటిస్తున్నారు. అయితే, వీరిద్దరూ ఈ సినిమాలో స్వలింగ ప్రేమికులుగా (Lesbians) కనిపించనున్నారనే వార్త బాలీవుడ్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతోంది.

హోమీ అదజానియా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉండబోతోందని టాక్. షాహిద్ కపూర్ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపిస్తారని చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. 2012లో దీపికా పదుకొణె, సైఫ్ అలీఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'కాక్‌టెయిల్'కు సీక్వెల్‌గా ఇది రానుంది.

ఈ సినిమా షూటింగ్ జనవరి 31వ తేదీన విజయవంతంగా పూర్తయినట్లు దర్శకుడు హోమీ అదజానియా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. రష్మిక, కృతి సనన్ పాత్రలపై వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించనప్పటికీ, ఒకవేళ ఇదే నిజమైతే ఈ మల్టీస్టారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News