Prabhas New Movie: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, ప్రభాస్ స్పెషల్ డేట్స్.. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం!
యంగ్ 'రెబల్ స్టార్' ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే డార్లింగ్ చేతిలో ఫౌజీ, స్పిరిట్ వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి.
Prabhas New Movie: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, ప్రభాస్ స్పెషల్ డేట్స్.. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం!
యంగ్ 'రెబల్ స్టార్' ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే డార్లింగ్ చేతిలో ఫౌజీ, స్పిరిట్ వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' సీక్వెల్ కూడా లైన్‌లో ఉంది. ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో కల్కి 2 షూటింగ్ ఆలస్యమవుతుందని అందరూ భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం డార్లింగ్ ఈ చిత్రానికి ప్రత్యేకంగా డేట్స్ కేటాయించినట్టు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఫిబ్రవరి చివరి వారంలో కల్కి 2 షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని టాక్. రెండు వారాల పాటు కీలక షెడ్యూల్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ షూట్‌లో ప్రభాస్‌తో పాటు దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా పాల్గొననున్నారని సమాచారం. ఇప్పటికే కొన్ని కీలక లొకేషన్లలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోందని తెలుస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్‌ను మొదటి భాగం కంటే మరింత గ్రాండ్‌గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మొదటి భాగం భారీ విజయంతో సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి. ప్రభాస్ డేట్స్ ఇచ్చారనే వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
కల్కి 2 షూట్ తర్వాత ప్రభాస్ తిరిగి హను రాఘవపూడి దర్శకత్వంలోని ఫౌజీ షూట్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమా ఇదే ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ కూడా ప్రభాస్ కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. మొత్తంగా ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. కల్కి 2 షూటింగ్ ప్రారంభం వార్త నిజమైతే.. అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.