Samantha: ఆ విషయం గుర్తించకపోతే భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుంది. సమంత కామెంట్స్ వైరల్
నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సమంత. ఏ మాయ చేశావే సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన సమంత.
ఆ విషయం గుర్తించకపోతే భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుంది. సమంత కామెంట్స్ వైరల్
Samantha Comments For Couple On Valentines Day
Samantha: నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సమంత. ఏ మాయ చేశావే సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన సమంత. ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ అందర్నీ మాయ చేసేశారు. అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. అలా కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దంటూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం సామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
మీరు ఒక వ్యక్తితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండవచ్చు. కానీ మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా లేనప్పుడు మీరు కోరుకున్నభాగస్వామికి నచ్చినట్టుగా కనిపించలేరు. ఒక వ్యక్తి పైకి అందంగా కనిపించినా.. మానసికంగా ప్రశాంతంగా ఉండరు. ఆ విషయాన్ని గుర్తించకపోతే ఏదో సమయంలో మనం ఆ భాగస్వామిని కోల్పోవాల్సి ఉంటుందని తన మనసులో మాటల్ని చెప్పుకొచ్చింది సమంత. అయితే సమంత మాటల వెనుక ఆంతర్యం ఏంటా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సమంత అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ దక్కించుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెరీర్ మొదట్లోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేశారు. అలా అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇలా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు.
చైతుతో విడాకులు, అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవల మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. వెబ్ సిరీస్‌ల్లో కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం మా ఇంటి బంగారం, రక్త్ బ్రహ్మాండ్ వంటి డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.