రష్మిక టాలెంట్‌కి సల్మాన్ ఫ్లాట్.. తర్వాత సినిమానూ ఛాన్స్..
కొన్నేళ్లుగా ఈ అమ్మడు జోరు మామూలుగా లేదు. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు.
రష్మిక టాలెంట్‌కి సల్మాన్ ఫ్లాట్.. తర్వాత సినిమానూ ఛాన్స్..
రష్మిక మందన్నకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. పుష్ప, యానిమల్ సినిమాతో ఆమె పేరు మార్మోగింది. దీంతో ప్రస్తుతం పాన్ ఇండియా స్ఠాయిలో ఓ వెలుగు వెలుగుతున్నారు.ఇటీవల పుష్ప2తో మరో భారీ పాన్ ఇండియా హిట్ కొట్టారు రష్మిక. త్వరలోనే బాలీవుడ్ సినిమా ఛావాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాదు సల్మాన్ ఖాన్‌తో సికిందర్ సినిమాలో నటిస్తున్నారు. అయితే రష్మికకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. రష్మిక టాలెంట్‌కు ఫిదా అయిన సల్మాన్.. తన నెక్ట్స్ సినిమాలోనూ ఆఫర్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
కొన్నేళ్లుగా ఈ అమ్మడు జోరు మామూలుగా లేదు. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు.బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న సికిందర్ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ రంజాన్ కానుకగా మార్చి 28న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక పనితీరు మెచ్చిన సల్మాన్.. తన తర్వాత సినిమాకు కూడా రష్మికనే హీరోయిన్‌గా కన్ఫామ్ చేసినట్టు సమాచారం.
సికిందర్ తర్వాత మరో తమిళ దర్శకుడు అట్లీతో సల్మాన్ ఖాన్ సినిమా చేయబోతున్నారు. జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టిన అట్లీ.. తన తర్వాత సినిమాను సల్మాన్ ఖాన్, రజినీకాంత్‌తో మల్టీ స్టారర్‌గా రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా రష్మికను సల్మాన్ ఓకే చేసినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో రష్మిక అదృష్టం పడిందంటున్నారు అభిమానులు.