Rashmika Mandanna: రష్మిక మరో సర్‌ప్రైజ్.. ఛావా సినిమాతో పాటు థామా టీజర్ రిలీజ్

Rashmika Mandanna Two Movies Double Dhamaka
x

రష్మిక మరో సర్‌ప్రైజ్.. ఛావా సినిమాతో పాటు థామా టీజర్ రిలీజ్ 

Highlights

నేషనల్ క్రష్ రష్మిక.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప2తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక.. కథల ఎంపికలో జోరు ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నారు.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప2తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక.. కథల ఎంపికలో జోరు ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నారు. ఇటు తెలుగు, అటు తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఛావా సినిమాతో ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఛావా సినిమాతో పాటు రష్మిక మందన్న నటిస్తున్న థామా సినిమా టీజర్ థియేటర్‌లో విడుదల కానున్నట్టు సమాచారం.

ఈ మూవీలో బాలీవుడ్ హీరో ఆయుస్మాన్ ఖురానా, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దినేష్ విజన్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్నారు. రెండు కాలాల మధ్య కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఛావా చిత్రం ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై దినేష్ విజయన్ నిర్మించారు. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరి ప్రేమాభిమానాలు సొంతం చేసుకున్నారు రష్మిక మందన్న. వరుస హిట్స్‌ సాధిస్తున్నారు. ఇప్పుడు ఛావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక రష్మిక జాబితాలో ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్, సికిందర్, కుబేర చిత్రాలున్నాయి. మరి ఛావా సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories