Sai Pallavi: శింబుతో సినిమాకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్..?
శింబు ప్రస్తుతం కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
శింబుతో సినిమాకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్..?
Sai Pallavi: శింబు ప్రస్తుతం కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మరో మూడు సినిమాల్లో నటించడానికి శంబు సిద్దమవుతున్నారు. అందులో ఒకటి పార్కింగ్ చిత్రం. రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డాన్ పిక్చర్ పతాకంపై ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
శింబు గతంలో నటించిన సినిమాల్లో ఎక్కువగా రొమాంటిక్ సినిమాలే. ఆయన సినిమాల్లోనూ లవ్, రొమాన్స్ సీన్స్ ఎక్కువుంటాయనే పేరుంది. ఆయనకు కోలీవుడ్ ప్లే బాయ్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. నయనతార, హన్సిక, త్రిష వంటి వారితో శింబు ప్రేమాయణం నడిపించినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇది పక్కన పెడితే సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ చేయరు. మరి శింబు సినిమాలో నటించడానికి సాయిపల్లవి ఎలా అంగీకరించారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లేదంటే ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ అయి ఉండవచ్చని అందుకే ఆమె ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వీరి క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.