Liger Movie: "లైగర్" రన్ టైమ్ ఎంతో తెలుసా?!.. తక్కువ రన్ టైమ్ లో కట్ చేసిన పూరి..

"లైగర్" ని తక్కువ రన్ టైమ్ లో కట్ చేసిన పూరి

Update: 2022-08-20 09:30 GMT

Liger Movie: "లైగర్" రన్ టైమ్ ఎంతో తెలుసా?!.. తక్కువ రన్ టైమ్ లో కట్ చేసిన పూరి..

Liger Movie: గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న యువహీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు "లైగర్" సినిమా పైన తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరి కనెక్ట్స్ పతకంపై పూరి జగన్నాథ్ మరియు చార్మికౌర్ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 25న ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా విడుదలకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చిత్ర ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉంది తాజాగా సినిమా రన్ టైమ్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

"లైగ‌ర్‌" ర‌న్‌టైమ్ చాలా షార్ప్‌గా 2 గంట‌ల 20 నిమిషాలు ఉండేటట్టు కట్ చేశారు పూరి. మొదటి హాఫ్ 75 నిమిషాలూ, సెకండ్ హాఫ్ 65 నిమిషాల్లో పూర్త‌వుతుందట. ఇందులోనే 7 ఫైట్లూ, 6 పాట‌లూ ఉన్నాయని సమాచారం. పూరి సినిమాల్లో పాట‌ల‌కు ప్రాధాన్యం ఎక్కువ‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'లైగ‌ర్' కోసం ముంబైలో భారీ సెట్లు వేయించి మారి షూట్ చేశారు పూరి.

Tags:    

Similar News