RRR Movie Update: హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ మూవీ కొత్త షెడ్యూల్
RRR Movie Update: సోమవారం నుంచి హైదరాబాద్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభించారు.
Rajamouli... RRR Movie:(The Hans India)
RRR Movie Update: కరోనా తో షూటింగులను ఆపేసిన సినిమాలు మళ్లీ సీన్ లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు తిరిగి సెట్స్‌పైకి వెళ్లగా.. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రీకరణ కూడా మొదలైంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరీస్ కథానాయికలు.సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. తొలిరోజు రామ్‌చరణ్ షూట్‌లో పాల్గొన్నారు.
మంగళవారం నుంచి ఎన్టీఆర్ కూడా చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. దాదాపు వారానికి పైగా సాగే ఈ షెడ్యూల్‌లో.. చరణ్, తారక్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కథతో రూపొందుతున్న చిత్రమిది. అల్లూరిగా రామ్‌చరణ్ నటిస్తుండగా.. భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.