అంతర్జాతీయ అవార్డుల్లో RRR హవా.. RRRకు నాలుగు విభాగాల్లో అవార్డులు..
* హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డును దక్కించుకున్న RRR
అంతర్జాతీయ అవార్డుల్లో RRR హవా
Golden Globe Award: అంతర్జాతీయ అవార్డుల్లో RRR హవా కొనసాగుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ట్రిపుల్ ఆర్.. మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు్ల్లో ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌తో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో ట్రిపుల్ ఆర్‌కు అవార్డులు దక్కాయి.