Renu Desai: విడాకులు తీసుకున్న వారిని కూడా ఓ మనిషిగా చూడండి
Renu Desai: రేణు దేశాయ్.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను నిస్సందేహంగా తెలుపుతూ, టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంటారు రేణు.
Renu Desai: విడాకులు తీసుకున్న వారిని కూడా ఓ మనిషిగా చూడండి
Renu Desai: రేణు దేశాయ్.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను నిస్సందేహంగా తెలుపుతూ, టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంటారు రేణు. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్న నాటి నుంచి రేణు సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ చేసినా వైరల్ అవుతుంది. రేణు చేసే పోస్ట్‌లకు కొందరు సానుకూలంగా స్పందిస్తే, మరికొందరు ట్రోలింగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. తనను దురదృష్టవంతురాలని పిలుస్తుండటం చాలా బాధగా ఉందని, అలా పిలవొద్దని చెప్పి చెప్పి అలసిపోయానని చెప్పుకొచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఓ నెటిజన్ రేణు దేశాయ్‌ని ఉద్దేశిస్తూ.. ‘మీరు దురదృష్టవంతురాలు మేడమ్’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన రేణు.. ‘నేను ఎలా దురదృష్టవంతురాలినో చెప్పగలరా. మీ సమాధానం కోసం వేచి చూస్తున్నా’అని రిప్లై ఇచ్చారు.
ఇదే విషయాన్ని నెటిజన్లతో పంచుకున్న రేణు.. ‘దురదృష్టవంతురాలు అనే మాట నన్ను ఎంతగానో బాధిస్తోంది. విడాకులు తీసుకుని, నా భర్త వేరే పెళ్లి చేసుకుంటే, కొంతమంది వ్యక్తులు సంవత్సరాలుగా అలా కామెంట్ చేస్తుండటం బాధగా ఉంది. ఆ మాటలు విని విని విసిగొచ్చింది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు ముడిపెడుతున్నారు. నా జీవితంలో ఇప్పటివరకూ నాకు దక్కిన ప్రతి విషయానికి నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నా. అలాగే, నాకు లేని వాటి గురించి నేనెప్పుడూ బాధపడలేదు. విడాకులు తీసుకున్నంత మాత్రాన స్త్రీ, పురుషులు దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు. కేవలం వాళ్ల వైవాహిక జీవితం మాత్రమే ముందుకు సాగలేదు’’అంటూ రాసుకొచ్చారు.
ఇక ఇదే పోస్ట్ కింద కామెంట్ చేస్తూ.. మనం 2024లో ఉన్నామని, ఒకరి అదృష్టాన్ని అతడు/ఆమె విడాకుల కారణంగానో లేదా చనిపోయిన భాగస్వామితో పోల్చి చెప్పడంతోనో ఇకనైనా ఆపండని అన్నారు. సమాజం ఇప్పటికైనా మారాలన్న రేణు.. విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిగా చూడండని విజ్ఙప్తి చేశారు. వ్యక్తులకు ప్రతిభ, శ్రమ ఆధారంగా గుర్తింపునివ్వాలని.. పాతవాటిని తవ్వుకుంటూ చేసే ఆలోచనల్ని పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోండి అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.