Renu Desai: దేశం గురించి ఆలోచించే వాళ్లు ముందు ఆ పని చేయ‌డంటూ రేణూ దేశాయ్ స‌ల‌హ‌

నటి రేణు దేశాయ్ చైనా ఉత్పత్తుల వాడకాన్ని మానేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ భద్రత, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఈ మార్పుకు భాగస్వాములవ్వాలంటూ సందేశం. పూర్తి వివరాలు చదవండి.

Update: 2025-05-16 06:43 GMT

Renu Desai: దేశం గురించి ఆలోచించే వాళ్లు ముందు ఆ పని చేయ‌డంటూ రేణూ దేశాయ్ స‌ల‌హ‌

Renu Desai: సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే నటి రేణు దేశాయ్. తాజాగా మరో కీలకమైన విషయంపై స్పందిస్తూ చైనా ఉత్పత్తుల వాడకాన్ని మానేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేశ భద్రత, కుటుంబ శ్రేయస్సు నిజంగా మనకు ముఖ్యమైతే చైనాలో తయారైన చిన్న వస్తువును కూడా కొనడం మానేయాలంటూ రేణు దేశాయ్ తన సందేశంలో పేర్కొన్నారు. "ఏదైనా వస్తువు కొనే ముందు దాని లేబుల్‌ను చూసే అలవాటు ఇప్పటినుంచైనా మొదలుపెట్టండి. మనం ఇకపై చైనా ఉత్పత్తులను కొనడం మానేశామన్న విషయం అందరికీ తెలియాలంటూ" ఆమె సూచించారు.

తానూ గతంలో చైనాలో తయారైన వస్తువులు కొనుగోలు చేసినప్పటికీ, ఇప్పుడు ప్రతి వస్తువు మీద ఉండే లేబుల్‌ను శ్రద్ధగా పరిశీలిస్తున్నానని, అది చైనాలో తయారైనదైతే కొనడం మానుకుంటున్నానని తెలిపారు. ఈ మార్పు ఒకరోజులో సాధ్యపడే పని కాదని, ఇది సుధీర్ఘమైన ప్రక్రియ మరియు కష్టం, కానీ మనం ఎక్కడో ప్రారంభించాలి. మీరు కొనాలనుకునే వస్తువుల మూలం కోసం లేబుల్‌లను చదవండి మరియు మీ దేశాన్ని గర్వంగా ఆదరించండి.. జై హింద్’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News