మహేష్ బాబుకు తల్లిగా రేణు దేశాయ్..

ప్రముఖ సినీనటి, దర్శకురాలు రేణుదేశాయ్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

Update: 2020-05-01 13:09 GMT
Renu desai, Mahesh babu

ప్రముఖ సినీనటి, దర్శకురాలు రేణుదేశాయ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తల్లిగా నటించాలని ఆసక్తి కనబరుస్తూన్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సుస్వాగతం చిత్రంలో హీరోయిన్‌గా నటించిన దేవయాని కూడా మహేష్ నటించిన నాని సినిమాలో అమ్మగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు రేణు దేశాయ్ కూడా ఆ పాత్ర చేయాలని ముచ్చట పడుతున్నారు.

ఈ విషయాన్ని రేణూ దేశాయ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో సినితరలంతా ఇళ్లకు పరిమితం అయ్యారు. కొందరు ఇంటిపనులు చేస్తూ.. కొందరు ఛాలెంజ్ లు చేస్తూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు కూడా రేణు దేశాయ్ కూడా ఇదే చేశారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్‌కి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మహేష్‌, ప్రభాస్ వంటి హీరోలకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా? అని నెటిజన్లు రేణు దేశాయ్ కు ప్రశ్న సంధించారు. దీనికి రేణు కూడా చాలా కూల్‌గా సమాధానమిచ్చింది. హీరోల చిన్నతనంలోని పాత్రలకు అమ్మ పాత్ర చేయడానికి సిద్ధమేనని చెప్పింది. తనను దర్శకులు ఓల్డ్ లుక్‌లో బాగా చూపింగలరనే నమ్మకం ఉంటే మహేష్‌ బాబు లాంటి హీరోలకు తల్లిగా నటిచేందుకు సిద్ధమేనని రేణు దేశాయ్ చెప్పారు. తను చిన్న పెద్ద అనే తేడా లేదాని.. తాము నటులమని ఎలాంటి పాత్ర వచ్చినా పోషించేందుకు సిద్ధంగా ఉండాలని రేణు దేశాయ్ చెప్పింది.

Tags:    

Similar News