RC 16 Movie: కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ లో చరణ్...?

RC 16 Movie: కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ లో చరణ్...?

Update: 2023-04-27 10:30 GMT

RC 16 Movie: కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ లో చరణ్...?

RC 16 Movie: RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో జరుగుతోంది. క్లైమాక్స్ భాగాన్ని 12వందల మంది ఫైటర్లతో భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న గేమ్ ఛేంజర్ ను వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది.

గేమ్ ఛేంజర్ తర్వాత రాంచరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాంచరణ్ తో తీసే సినిమాని స్పోర్ట్స్ డ్రామాగా తీయాలనుకుంటున్న బుచ్చిబాబు ఇందుకు మన ఇండియన్ హెర్కులెస్ కోడి రామ్మూర్తి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని కథను సిద్ధం చేసుకున్నాడని టాక్ జోరుగా వినిపిస్తుంది.

కోడిరామ్మూర్తి అంటే నేటి జనరేషన్ కు పెద్దగా తెలియక పోవచ్చు కానీ..కలియుగ భీముడిగా తెచ్చుకున్న తెలుగు వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు. తెలుగువాడెంత బలాడ్యుడో దేశదేశాలకు చాటిన టార్నెడో కోడిరామ్మూర్తి. విజయనగరానికి చెందిన కోడి రామ్మూర్తి నాయుడు కుస్తీ పోటీల్లో కలియుగ భీముడిగా పేరుతెచ్చుకున్నారు. వెస్ట్రన్, ఇండియన్ స్టయిల్స్ ని మిక్స్ చేసి సరికొత్త వ్యాయామాలకు ఆయన రూపకల్పన చేశారు. సర్కస్ కంపెనీని స్థాపించి దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. పేరు ప్రఖ్యాతలతో పాటు ఆయన్ను చంపేందుకు శత్రువులు పెరిగారు. ఆయనపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఇక ప్రదర్శనల ద్వారా వచ్చిన సంపాదనను ఆయన స్వాతంత్ర్య పోరాటానికి ఇతోథికంగా సాయం అందించారు.

ఎంతో ఆసక్తికరమైన కోడిరామ్మూర్తి నాయుడు జీవితకథను హీరో రానా సినిమాగా తీస్తున్నారని కొన్నేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఇప్పుడు రాంచరణ్ హీరోగా ఇండియన్ హెర్కులెస్ జీవితానికి వెండితెర రూపం ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. కోడిరామ్మూర్తి నాయుడు జీవితకథను ఇన్స్ పిరేషన్ గా తీసుకొని డ్యూయల్ రోల్ లో చరణ్ తో సినిమాని బుచ్చిబాబు ప్లాన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా, ఇందులో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News