Rashmika Mandanna : ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండతో పెళ్లా?… చివరకు క్లారిటీ ఇచ్చిన రష్మిక

ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తున్న పాన్-ఇండియా స్టార్ రష్మిక మందన్నా, సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా… ఆమె పేరు మాత్రం ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మార్మోగుతూనే ఉంది.

Update: 2025-12-04 07:07 GMT

రష్మిక మందన్న : ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండతో పెళ్లా?… చివరకు క్లారిటీ ఇచ్చిన రష్మిక

ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తున్న పాన్-ఇండియా స్టార్ రష్మిక మందన్నా, సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా… ఆమె పేరు మాత్రం ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మార్మోగుతూనే ఉంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్‌షిప్ గురించి వస్తున్న రూమర్లు ఎప్పటికపుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇరువైపులా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు కొత్త రూమర్  ఫిబ్రవరి 2026లో రష్మిక–విజయ్ పెళ్లి! ఈ వార్త బాగా వైరల్ అవుతుండగానే చివరకు రష్మిక స్పందించింది.

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..

“నా వివాహం గురించి ధృవీకరించడానికి లేదా ఖండించడానికి నేను ఇష్టపడను. దాని గురించి మాట్లాడాల్సిన సమయం వస్తే… నేనే చెబుతాను. అప్పటి వరకు ఏమీ చెప్పను” అని స్పష్టం చేసింది.

ఇలా చెప్పడంతో… పెళ్లి జరుగుతుందా? లేదా? అన్న సందేహం అలాగే కొనసాగుతోంది. ఆమె స్పందనతో రూమర్స్ తగ్గడం బదులుగా మరింత పెరిగాయి.

ఇందుకు కారణం

గత అక్టోబర్‌లోనే వీరి నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగిందని, రెండు కుటుంబాలే హాజరయ్యాయని టాక్ వినిపిస్తోంది. అలాగే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయని, ఫిబ్రవరిలో గ్రాండ్‌గా శుభముహూర్తం ప్లాన్ చేశారని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో మళ్లీ మాటలు వినిపిస్తున్నాయి.

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత రష్మిక–విజయ్ జంటపై అభిమానుల్లో ఎప్పటి నుంచో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే ఈ పెళ్లి రూమర్లు హద్దులు దాటేలా వైరల్ అవుతున్నాయి.

కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు… అంతా ఊహగానాలే!

Tags:    

Similar News