Kalki 2898 AD 2: ‘కల్కి 2’లో ఈ స్టార్ హీరోయిన్ ఫిక్స్!

Kalki 2898 AD 2: సూపర్ స్టార్ మహేష్‌ ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్న ప్రియాంక చోప్రా మరో భారీ ప్రాజెక్టులో అడుగుపెట్టనుంది.

Update: 2025-12-04 11:08 GMT

Kalki 2898 AD 2: ‘కల్కి 2’లో ఈ స్టార్ హీరోయిన్ ఫిక్స్!

Kalki 2898 AD 2: సూపర్ స్టార్ మహేష్‌ ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్న ప్రియాంక చోప్రా మరో భారీ ప్రాజెక్టులో అడుగుపెట్టనుంది. కల్కి-2లో దీపిక స్థానంలో ప్రియాంక ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా ఉంది. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. 

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అపార అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా మరో క్రేజీ సీక్వెల్‌లోనూ కనిపించే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి-2’ త్వరలో తెరకెక్కనుంది. మొదటి భాగంలో దీపిక పదుకొనే కీలక పాత్ర పోషించగా, సీక్వెల్‌లో ఆమె ఉండబోనట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది.

Tags:    

Similar News