ఆ ప్రయాణం మరువలేనిది… ‘పుష్ప’పై అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్టు

సోషల్ మీడియాలో హృదయాన్ని తాకే పోస్ట్ చేసిన ఐకాన్ స్టార్

Update: 2025-12-05 06:32 GMT

ఆ ప్రయాణం మరువలేనిది… ‘పుష్ప’పై అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్టు

పాన్ ఇండియా రికార్డులను దాటుతూ, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పుష్ప 2: ది రూల్’ విడుదలై నేటికి కచ్చితంగా ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా చిత్ర హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు.

"పుష్ప ఫ్రాంచైజీ మా జీవితంలో ఐదేళ్ల పాటు సాగిన మరుపురాని ప్రయాణం" అని బన్నీ పేర్కొన్నారు. ప్రేక్షకుల ప్రేమ తనను, తన టీమ్‌ను మరింత నమ్మకం, ధైర్యంతో నింపిందని చెప్పారు.

ప్రపంచం నలుమూలల నుంచి లభించిన ఆదరణ, ప్రేమ, ప్రశంసలకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆయన తెలిపారు.

అలాగే ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, పంపిణీదారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్‌ను ‘మన కెప్టెన్’ అని పిలుస్తూ, ఆయన్ని కలిసి పనిచేయడం అద్భుత అనుభవమని అభివర్ణించారు.

"ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇచ్చిన ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అంటూ బన్నీ తన పోస్టును ముగించారు.

అల్లు అర్జున్ పెట్టిన ఈ భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News