This Week OTT Release: ఈ వారం ఓటీటీలో థ్రిల్లింగ్‌ సినిమాలు, అలరించే వెబ్‌సిరీస్‌లు!

ఈ వారం OTT రిలీజ్‌లలో థ్రిల్లింగ్‌ సినిమాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు: The Girlfriend, Stephen, Jatadhara, The Hunter Chapter 1, Dies Irae వంటి తాజా స్ట్రీమింగ్ వివరాలు.

Update: 2025-12-05 06:18 GMT

OTT Releases This Week, Latest Telugu OTT Movies, New Web Series 2025, Netflix Telugu Movies, Aha OTT Telugu, Prime Video Releases

ఈ వారం ఓటీటీ వేదికలు థ్రిల్లింగ్‌, మిస్టరీ, రొమాన్స్‌, హారర్‌ జోనర్లలో కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. తెలుగు సహా ఇతర భాషల్లో పలు చిత్రాలు స్ట్రీమింగ్‌కి వచ్చాయి. ఇప్పుడు ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఏ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చినాయో చూద్దాం.

‘The Girlfriend’ – Netflix

  • రష్మిక మందన్న, దీక్షిత్‌ శెట్టి జంటగా నటించిన ది గర్ల్‌ఫ్రెండ్‌ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌.
  • రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథ చిత్రం థియేటర్లలో మంచి స్పందన పొందింది. షరతులు లేని ప్రేమను నిజ జీవితానికి దగ్గరగా చూపించడం ఈ చిత్ర ప్రధాన ఆకర్షణ. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

‘Stephen’ – Netflix

  • ఆరు నెలల్లో తొమ్మిది మహిళల హత్యలు… ఓ సీరియల్‌ కిల్లర్‌ కథ… ఇదే నేపథ్యంలో రూపొందిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ స్టీఫెన్‌.
  • మిథున్‌ బాలాజీ దర్శకత్వంలో, ‘గార్గి’ ఫేమ్‌ గోమతి శంకర్‌ హీరోగా నటించారు.
  • డిసెంబర్‌ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌.
  • హత్యలకు కారణమేమిటి? అతడు ఒంటరిగా చేశాడా? అనేదే ఈ కథ హద్దులు.

‘Jatadhara’ – Amazon Prime Video

  • సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్‌ జటాధర ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉంది.
  • అభిషేక్‌ జైశ్వాల్‌, వెంకట్‌ కల్యాణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 7న థియేటర్లలో విడుదలై, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

‘The Hunter: Chapter 1’ – Aha

  • వైభవ్‌ హీరోగా, నందితా శ్వేత, తాన్య హోప్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం రణం అరం తవరేల్‌, తెలుగులో ‘ది హంటర్‌: చాప్టర్‌–1’ పేరుతో విడుదలైంది.
  • ఇప్పుడు తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌లో ఉంది.

‘Dies Irae’ – Disney+ Hotstar / Jio+Hotstar

  • ప్రణవ్‌ మోహన్‌లాల్‌ నటించిన మిస్టరీ హారర్‌ థ్రిల్లర్‌ డీయస్ ఈరే ఇప్పుడు హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌.
  • ‘భూత కాలం’, ‘భ్రమ యుగం’ ఫేమ్‌ రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం వహించారు.
  • తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.

ఈ వారం OTTలో స్ట్రీమింగ్ అయ్యే మరిన్ని వెబ్‌సిరీస్‌లు, మూవీస్

Netflix

  • The Abundance (Web Series – English)
  • The Price of Confession (Web Series – English)
  • The Night My Dad Saved Christmas 2 (Movie – English)
  • New York at 100 (Movie – English)
  • Jekelly (Movie – English)

Aha

  • Dhoolpet Police Station (Web Series – Telugu)

Amazon Prime Video

  • Surely Tomorrow (Web Series – English)
  • Man Finds Tape (Movie – English – Rent)
  • Sunnexts Arasayyanna Prema Prasanga (Kannada Movie)

Sony LIV

  • Kutram Purindhavan (Web Series – Malayalam/Telugu)

Zee5

  • The Great Pre-Wedding Show (Movie – Telugu)
Tags:    

Similar News