'అనసూయ' కోసం డైరెక్టర్ 'రవిబాబు' ఏం చేశారో తెలుసా?

టావీవుడ్ విలక్షణ నటుడు చలపతిరావు తనయుడిగా వెండితెరకు పరిచమయ్యారు రవిబాబు.

Update: 2021-02-12 11:53 GMT

రవిబాబు ఫైల్ ఫోటో 

టావీవుడ్ విలక్షణ నటుడు చలపతిరావు తనయుడిగా వెండితెరకు పరిచమయ్యారు రవిబాబు. మొదట్లో కామెడీ రోల్స్ తో పాటు విలన్ పాత్రలు కూడా చేశారు. మురారి చిత్రంలో రవిబాబు నటనకు మంచిమార్కులే పడ్డాయి. ఇండస్ట్రీలో కొంతకాలం నిలదొక్కుకున్నాక తన మార్క్ చూపించడం మొదలు పెట్టారు. అల్లరి, పార్టీ, అమరావతి, అవును, అమ్మాయిలు అబ్బాయిలు, మనసారా, నచ్చావులే, నువ్విలా వంటి చిత్రాలతో దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. రవిబాబు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని నిర్మాతలు భావిస్తుంటారు. ఆ భారోసాతోనే ఆయతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు.

ఇక 2007లో సినీయర్ హీరోయిన్ భూమిక ప్రధానపాత్రలో థ్రిల్లర్ జానర్‌లో రవిబాబు ఓ సినిమాను డైరెక్ట్ చేశారు. హీరోయిన్ ఒరియెంటెడ్ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ మూవీ ఏదో కాదు, అనసూయ. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అనసూయ మూవీ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా సమయంలో భూమిక కారణంగా ఆయన చెప్పలేని బాధలు పడ్డాడట. ఈ విషయాలను రవిబాబు పంచుకున్నాడు.

అయితే సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి భూమిక ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. రెండో రోజు సినిమా చిత్రీకరణ ఉంటుందని భావించా.. మరుసటి రోజు కూడా అదే భూమిక తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పింది.షూటింగ్‌ కోసమని నేను గడ్డం, జట్టుతో పాటు కనుబొమ్మలను కూడా గీయించుకున్నాను. భూమిక షూటింగ్ లో రానని చెప్పడమే కాదు ముంబైకి వెళ్ళిపోతున్నానని చెప్పి షాక్ ఇచ్చిందని రవిబాబు పేర్కొన్నారు. గుండు,కనుబొమ్మలు లేకుండా నేను బయట తిరగలేకపోయాను, జ్వరం కారణంగా భూమిక నలబైరోజులు షూటింగుకు దూరంగా ఉన్నారు. దీంతో దాదాపు 40 రోజుల వరకు బయటకు రాలేకపోయాను అంటూ రవిబాబు చెప్పుకొచ్చారు.

ఇక యుత్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ క్రష్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అవిరి చిత్రం నిరాశపరడంతో.. ఆ తర్వాత  వస్తున్న చిత్రం కావడంతో క్రష్ భారీ అంచనాలు పెట్టుకున్నారు రవిబాబు. ఇప్పటికే విడుదల అయ్యానా ఈ మూవీ ట్రైలర్ కు యుత్ అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Tags:    

Similar News