Bhartha Mahasayulaki Wignyapthi: సంక్రాంతి ట్రాక్ రికార్డ్.. మాస్ రాజా మాస్ కంబ్యాక్ లోడింగ్!
Bhartha Mahasayulaki Wignyapthi: రవితేజ హీరోగా సంక్రాంతికి సిద్ధమైన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Bhartha Mahasayulaki Wignyapthi: రవితేజ హీరోగా సంక్రాంతికి సిద్ధమైన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హాస్యం, ఎమోషన్స్‌తో కూడుకుని ఉంది. రవితేజ సంక్రాంతి ట్రాక్ రికార్డు ఈ సినిమాకు మరో బలమైన ఆధారం అనే చెప్పాలి.
మాస్ మహారాజ్ రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో సంక్రాంతి సందడికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా రేపు గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దర్శకుడు కిశోర్ తిరుమల తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీని అద్భుతంగా మేళవించారు. భార్యాభర్తల మధ్య సరదా సన్నివేశాలు, రవితేజ టైమింగ్ ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్‌గా మార్చే అవకాశం ఉంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించగా ఈ ఇద్దరు భామల మధ్య రవితేజ పడే పాట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని తెలుస్తుంది. పైగా ఈ సినిమా సెన్సార్ పూర్తయి యూ/ఏ సర్టిఫికేట్ పొందింది.
ఇంకో సూపర్ విషయం ఏంటంటే.. ఈ సినిమా నిడివి కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ షార్ట్ అండ్ స్వీట్ రన్‌టైమ్ ఈ జెన్ జీ ట్రెండ్‌లో ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది. అలాగే భీమ్స్ సిసిరోలియో సంగీతం కూడా ఈ సినిమాకు మరింత ఆకర్షణ జోడించింది. ఇక రవితేజకు సంక్రాంతి ట్రాక్ రికార్డ్ కూడా బాగానే ఉంది. గతంలో వాల్తేరు వీరయ్య, క్రాక్, మిరపకాయ్ లాంటి భారీ హిట్స్ ఇచ్చిన రవితేజకు సంక్రాంతి సెంటిమెంట్ ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రమోషన్స్‌తో ఈ సినిమా బాగా బజ్ అవుతోంది. దీంతో రవి తేజకు ఈ చిత్రం స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.