Chiranjeevi: సాలిడ్ హిట్టుతో బౌన్స్ బ్యాక్ అయిన చిరంజీవి
Chiranjeevi: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మళ్లీ తన మ్యాజిక్‌తో మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ ఫామ్‌లోకి తీసుకొచ్చాడు.
Chiranjeevi: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మళ్లీ తన మ్యాజిక్‌తో మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ ఫామ్‌లోకి తీసుకొచ్చాడు. 'భోళా శంకర్' డిజాస్టర్ తర్వాత 'మన శంకర వర ప్రసాద్ గారు'తో చిరు బౌన్స్ బ్యాక్ అయ్యారు.
అనిల్ రావిపూడి హిట్ మెషిన్‌గా రీజనల్ మార్కెట్‌ను ఏలుతున్నాడనే చెప్పాలి. గతంలో ప్లాప్‌ల్లో ఉన్న కల్యాణ్ రామ్, రవితేజ్, విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు అతను కొత్త జీవం పోసాడు. 'ఎఫ్2'తో వెంకటేష్ బౌన్స్ బ్యాక్ అయినట్లే 'సంక్రాంతికి వస్తున్నాం'తో మళ్లీ అదే మ్యాజిక్ జరిగింది. 'సైంధవ్' పరాజయం తర్వాత వెంకీ 300 కోట్ల క్లబ్‌లో చేరారు. ఇప్పుడు అందరి దృష్టి మెగాస్టార్ చిరంజీవి వైపు మళ్లింది.
'భోళా శంకర్' డిజాస్టర్ తర్వాత చిరు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 'విశ్వంభర' వాయిదా పడుతున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'పైనే అభిమానుల ఆశలన్నీ కేంద్రీకృతమయ్యాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలో అనిల్‌కు అద్భుతమైన టచ్ ఉంది. చిరంజీవి పాత సినిమాల స్పూర్తితోనే ఈ పాత్రను డిజైన్ చేశారు. ఈ సినిమాలో వైవిధ్యం లేకపోయినా వినోదం మాత్రం పూర్తిగా ఉంది. ఈ సినిమాకి వచ్చిన టాక్ చూస్తుంటే కచ్చితంగా మరో 300 కోట్ల బ్లాక్ బస్టర్ అవుతుందనే ధీమా కనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమాతో చిరు బౌన్స్ బ్యాక్ జరిగినట్లే అనిపిస్తోంది.