Nari Nari Naduma Murari: నారి నారి నడుమ మురారి.. సంక్రాంతికి మరో సూపర్ హిట్ వైబ్స్!

Nari Nari Naduma Murari: శర్వానంద్ నటనలో సంక్రాంతి సందడికి సిద్ధమైన 'నారి నారి నడుమ మురారి' ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Update: 2026-01-12 11:30 GMT

Nari Nari Naduma Murari: శర్వానంద్ నటనలో సంక్రాంతి సందడికి సిద్ధమైన 'నారి నారి నడుమ మురారి' ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 'సామజవరగమన' ఫేమ్ దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హాస్యం, ఎమోషన్‌తో కూడుకుని ఉంది. ట్రైలర్‌లోని కామెడీ సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చూస్తుంటే ఈ సినిమా మరో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది.

శర్వానంద్ కొత్త చిత్రం 'నారి నారి నడుమ మురారి' ట్రైలర్ తాజాగా విడుదలై భారీ సందడి సృష్టించింది. రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. తన ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్ తండ్రిని ఒప్పించి పెళ్లికి సిద్ధం చేసుకున్న సమయంలో అకస్మాత్తుగా ఎక్స్ లవర్ జీవితంలోకి ప్రవేశిస్తుంది.

ఈ ఇద్దరు మధ్య చిక్కుకున్న శర్వా పడే కామెడీ పరిస్థితులు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. శర్వా తనను తాను పరిచయం చేసుకునే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చూస్తుంటే ఈ సినిమా కూడా మరో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు జ్ఞానశేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్ర శేఖర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రిచ్ లుక్ ఇచ్చాయి. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే అన్ని అంశాలు ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News