Malaika Arora: విడాకులు, రిలేషన్‌షిప్స్ పై మలైకా షాకింగ్ టాక్!

Update: 2026-01-12 09:58 GMT

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన విడాకులు, రిలేషన్‌షిప్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ప్రేమపై ఇప్పటికీ నమ్మకం ఉందని, అయితే సరైన అదృష్టం కావాలని చెప్పారు. ఆడపిల్లలకు ముఖ్యమైన సలహా కూడా ఇచ్చారు. 

52 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన సౌందర్యంతో మెరిసే మలైకా అరోరా తన పర్సనల్ లైఫ్‌పై హృదయవిదారకంగా మాట్లాడారు. అర్బాజ్ ఖాన్‌తో పెళ్లి చేసుకుని విడిపోయిన తర్వాత మరో రిలేషన్‌షిప్‌లో ఉండి బ్రేకప్ అయ్యానని వెల్లడించారు. అయినప్పటికీ ప్రేమ అనే కాన్సెప్ట్ తప్పు కాదని, తనకు సెట్ కాలేదని మాత్రమే అన్నారు. ప్రేమను పంచడం, పొందడం ఇష్టమే కానీ అదృష్టం ఉండాలని స్పష్టం చేశారు.

ఆడపిల్లలకు సలహా ఇస్తూ చిన్న వయసులో పెళ్లి చేసుకోకూడదని, ఆర్థికంగా, మానసికంగా గట్టి పట్టు సాధించిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని సూచించారు. అర్బాజ్ ఖాన్ తర్వాత అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసిన మలైకా ప్రస్తుతం ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నానని, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పారు.

Tags:    

Similar News