Mana Shankara VaraPrasad Garu: పారితోషికాల్లోనూ మెగా మేనియా.. అనిల్ రావిపూడి, చిరు, వెంకీలకు అందింది ఎంతంటే?

Mana Shankara VaraPrasad Garu: సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ సత్తాను మరోసారి చాటారు.

Update: 2026-01-12 09:07 GMT

Mana Shankara VaraPrasad Garu: సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ సత్తాను మరోసారి చాటారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నేడు (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. థియేటర్ల వద్ద మెగాభిమానుల కోలాహలం కనిపిస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి 'బ్లాక్ బస్టర్' టాక్ వస్తోంది.

వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్!

ఈ సినిమాకు ప్రధాన బలం మెగాస్టార్ చిరంజీవి నటన మరియు డ్యాన్సులు. చాలా కాలం తర్వాత వింటేజ్ చిరంజీవిని చూశామని అభిమానులు సంబరపడుతున్నారు. అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీని మేళవించి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇక విక్టరీ వెంకటేష్ చేసిన 20 నిమిషాల గెస్ట్ రోల్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. లేడీ సూపర్ స్టార్ నయనతార స్క్రీన్ ప్రజెన్స్ మరియు భారీ తారగణం సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి.

నెట్టింట వైరల్: పారితోషికాల వివరాలు

సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, ఇందులో నటించిన స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సుమారు రూ.70 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు వెంకటేష్ గెస్ట్ రోల్‌ కూబా బాగా హెల్ప్ అయ్యింది. సినిమాలో ఆయన సుమారు 20 నిమిషాల పాటు కనిపించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.9 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు టాక్. ఇక నయనతార రూ. 6 కోట్లు, దర్శకుడు అనిల్ రావిపూడి రూ. 20 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం.

Tags:    

Similar News