Ravi Teja: కథ ఫిక్స్ అయ్యాక నేను ఇన్వాల్వ్ అవ్వను..

* ఒకవేళ స్కోప్ ఉంది అంటే స్క్రిప్ట్ ని ఇంకా బెటర్ గా చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తాము,"

Update: 2022-12-22 12:07 GMT

ఒకసారి కథ ఫిక్స్ అయితే అందులో తల దూర్చను అంటున్న మాస్ మహారాజా

Ravi Teja: వరుసగా "ఖిలాడి" మరియు "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న మాస్ మహారాజ రవితేజ తాజాగా ఇప్పుడు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో "ధమాకా" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. "పెళ్లి సందడి" బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాతో అయినా రవితేజ ఫామ్ లోకి వస్తే బాగుంటుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో మాట్లాడుతూ రవితేజ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. "ఒక సినిమాని డైరెక్టర్ హిట్ చేయగలుగుతారా లేదా ఫ్లాప్ అవుతుందా అనేది ముందే డిసైడ్ చేయలేము. నాకు కథ నచ్చితే డైరెక్టర్ ముందు సినిమా రిసల్ట్ గురించి ఆలోచించను," అని అన్నారు రవితేజ. అంతేకాకుండా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కూడా కొన్ని సలహాలు ఇస్తాను తప్ప మేకింగ్ స్టేజ్లో ఇన్వాల్వ్ అవ్వనని అన్నారు రవితేజ. "ఒకసారి కథ లాక్ అయిపోయాక నేను మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను. ఒకవేళ స్కోప్ ఉంది అంటే స్క్రిప్ట్ ని ఇంకా బెటర్ గా చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తాము," అని అన్నారు.

ఇక సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీ లీల గురించి మాట్లాడుతూ "శ్రీ లీల చాలా అందంగా ఉంటుంది అంతే టాలెంటెడ్ కూడా. తన గొంతే తనకి పెద్ద బలం," అని చెప్పుకొచ్చారు రవితేజ. టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కొచ్చిబౌట్ల వంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలతో పనిచేయటం చాలా సంతోషంగా ఉందని, ఇద్దరూ చాలా పాజిటివ్ పీపుల్ అని వారితో చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని అన్నారు రవితేజ.

Tags:    

Similar News