నో రికార్డ్స్, నో రిపోర్ట్స్, నో రిలేటివ్స్.. డిస్కోరాజా టీజర్.. స్టైలిష్గా రవితేజ
మాస్ మహారాజా రవితేజ హీరోగా పాయల్ రాజ్పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన కొత్త చిత్రం డిస్కోరాజా. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బీజీగా ఉంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ తెలిపింది. శుక్రవారం విడుదలైనా ఈ టీజర్ లో రవితేజ కొత్త లూక్ లో కనిపిస్తున్నారు. గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో రవితేజ స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
ఈ టీజర్ లో రవితేజ ఎంట్రీ ఓడైలాగ్ తో ఉంటుంది. అద్యంతం ఈ సినిమా మెడికల్ క్రైం చూట్టూ ఉంటుందని టీజర్లో తెలుస్తోంది. టీజర్లో కనిపించే కొన్ని సన్నివేశాల్లో వచ్చే లోకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. డైనమిక్ డైరెక్టర్ ఆనంద్ దీనిపై స్పందించారు. ఐస్ లాండ్ పలు సన్నివేశాలు చిత్రికరీంచామని తెలిపారు. హాలీవుడ్ నిపుణల పర్యవేక్షణలో కొన్ని సన్నీవేశాలు చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఫ్యాన్స్ ను ఈ సినిమా మెప్పిస్తుందని, కచ్చితంగా సినిమా రవితేజ కెరీర్ లో వైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. రవితేజ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతుందని నిర్మాత తాళ్లూరి రామ్ తెలిపారు. డిస్కోరాజాలో అన్ని వర్గాలను నచ్చే ఎలిమేట్స్ ఉన్నాయన్నారు.
కాగా.. ఈ చిత్రాన్ని 2020 జనవరి 24న విడుదలకు సన్నాహాలు చెస్తునామని రామ్ తళ్లూరి తెలిపారు. బాబీసింహా, వెన్నెల కిషోర్, తాన్యా హోప్,సత్య పలువరు నటీనటులు ముఖ్య పాత్రలుపోషించారు. తమన్ సంగీతం బాణీలు అందించారు. తాజా విడుదలైనా ఈ టీజర్ మీరు చూడండి.