Rashmika: ఏంటీ.. విజయ్,రష్మిక నిజమేనా.? హింట్ ఇచ్చిన నేషనల్ క్రష్

Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Update: 2025-05-03 08:52 GMT

Rashmika: ఏంటీ.. విజయ్,రష్మిక నిజమేనా.? హింట్ ఇచ్చిన నేషనల్ క్రష్

Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘గీత గోవిందం’ చిత్రంతో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ, అనంతరం ‘డియర్ కామ్రేడ్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇరువురూ నుంచి ఎలాంటి స్పందన మాత్రం రాలేదు. అయితే అడపాదడపా వీరిద్దరు కలిసి వెకేషన్స్ వెళ్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ జంట మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఓ కొత్త సినిమా ప్రకటించారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఆయన రూపొందించిన ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్‌తో కలిసి మరో చిత్రాన్ని ఆయన రూపొందించబోతున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న నటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, రాహుల్ సంకృత్యాన్ కలిసి "#HMMLetsee" అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేస్తూ రష్మికను ట్యాగ్ చేయగా, ఆమె “నిజమే గాయిస్” అంటూ స్పందించింది రష్మిక. దీంతో ఈ ప్రాజెక్ట్‌లో ఆమె భాగమనే వార్తలకు బలం చేకూర్చినట్లైంది. అయితే #HMMLetsee అనే పదానికి అర్థం మాత్రం ఇంకా బయటపడలేదు. త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.

గతంలో ‘డియర్ కామ్రేడ్’ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా, ఇప్పుడు మరోసారి అదే బ్యానర్ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను విజయ్-రష్మికలతో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న రష్మిక, విజయ్‌తో ఉన్న స్నేహం కారణంగా డేట్లు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 


Tags:    

Similar News