Rashmika Mandanna: బర్త్‌డే వేడుకల కోసం రష్మిక ఎక్కడికి వెళ్లిందో తెలుసా.? అతను కూడా..

Rashmika Mandanna Celebrates Birthday in Oman Desert with Vijay Deverakonda
x

Rashmika Mandanna: బర్త్‌డే వేడుకల కోసం రష్మిక ఎక్కడికి వెళ్లిందో తెలుసా.? అతను కూడా..

Highlights

Rashmika Mandanna: రష్మిక మందన.. ఇప్పుడీ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Rashmika Mandanna: రష్మిక మందన.. ఇప్పుడీ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప చిత్రంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా నటిగా మారిన రష్మిక ప్రస్తుతం భాషలతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో బిజీగా మారింది. ఛావా చిత్రంతో మరోసారి బాలీవుడ్‌లో తన సత్తా చాటిందీ నేషనల్‌ క్రష్‌. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా షూటింగ్‌కు కాస్త బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్‌ 5వ తేదీన రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈసారి బర్త్‌డే వేడుకను మరింత గ్రాండ్‌ సెలబ్రేట్‌ చేసుకునేందుకు రష్మిక తన సన్నిహితులతో కలిసి ఒమాన్‌ దేశం వెళ్లినంద వార్తలు వస్తున్నాయి. అక్కడి అందమైన ఎడారిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ ట్రిప్ కోసం ఆమె సన్నిహితులు కూడా ఓమన్ చేరినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ వేడుకలకు విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యాడని టాక్ వినిపిస్తోంది. ఇద్దరూ మాత్రమే కాకుండా వారి మిత్ర వర్గం కూడా అక్కడే ఉందట. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి విజయ్‌తో కలిసి దిగిన ఫొటోను ఈసారైనా ఈ బ్యూటీ అభిమానులతో షేర్‌ చేసుకుంటుందో లేదో చూడాలి.

రష్మిక కెరీర్‌ విషయానికొస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన సికందర్ సినిమా రిలీజ్ అయింది. తెలుగులో గర్ల్‌ఫ్రెండ్ అనే చిత్రంలో నటిస్తోంది. పుష్ప 3 లోనూ ఆమె పాత్ర ఉండబోతోందని టాక్. అలాగే ధనుష్ సరసన కుబేర సినిమాలో నటిస్తోంది. హిందీలోనూ పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్న రష్మిక లేడీ ఓరియెంటెడ్‌ మూవీల్లో నటించేందుకు మొగ్గు చూపుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories