Mysaa: రష్మిక ‘మైసా’ గ్లింప్స్: ‘నేషనల్ క్రష్’ నుంచి ‘రెబల్ వారియర్’గా.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసం గ్యారెంటీ!

Mysaa: పుష్ప’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో గ్లోబల్ స్టార్‌డమ్ అందుకున్న రష్మిక మందన్న, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Update: 2025-12-24 06:35 GMT

Mysaa: రష్మిక ‘మైసా’ గ్లింప్స్: ‘నేషనల్ క్రష్’ నుంచి ‘రెబల్ వారియర్’గా.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసం గ్యారెంటీ!

Mysaa: పుష్ప’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో గ్లోబల్ స్టార్‌డమ్ అందుకున్న రష్మిక మందన్న, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’ (Mysaa) చిత్రం నుంచి నేడు (డిసెంబర్ 24) విడుదలైన యాక్షన్ గ్లింప్స్ సినీ ప్రియులను అబ్బురపరుస్తోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి చిత్రాల్లో సున్నితమైన పాత్రల్లో కనిపించిన రష్మిక, ఇందులో కంప్లీట్ మాస్ అండ్ రెబల్ లుక్‌లో దర్శనమిచ్చింది.

తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో రష్మిక లుక్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంది. ఒళ్లంతా రక్తం, తెగిపోయిన చేతి బేడీలు, చేతిలో గన్ పట్టుకుని, కళ్లలో ప్రతీకార జ్వాలలతో కనిపిస్తున్న తీరు ఆమెలోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరించింది. ఒక గిరిజన యువతిగా, అన్యాయంపై గర్జించే వీరనారిగా రష్మిక మేకోవర్ అదిరిపోయింది. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌కు మరింత బలాన్నిచ్చింది. కల్కి 2898 AD ఫేమ్ ఆండీ లాంగ్ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం విశేషం.

గొండు తెగల నేపథ్యంలో పవర్‌ఫుల్ స్టోరీ

‘మైసా’ అంటే అర్థం “అమ్మ”. ఈ చిత్రం గోండు గిరిజన తెగల నేపథ్యంతో సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. తన సమాజం కోసం, తన హక్కుల కోసం పోరాడే ఒక నాయకురాలిగా రష్మిక పాత్ర ఉండబోతోంది. ఆదిలాబాద్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథా గమనం సాగుతుందని సమాచారం.

Full View


Tags:    

Similar News