Rashmika Mandanna: ప్రియాంక చోప్రాను భారీ దెబ్బకొట్టిన రష్మిక.. హృతిక్ ఒప్పుకున్నాడా ?
Rashmika Mandanna : రష్మిక మందన.. ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్. తన క్రేజ్ కూడా రోజురోజుకూ ఇంకా పెరుగుతోంది.
Rashmika Mandanna: ప్రియాంక చోప్రాను భారీ దెబ్బకొట్టిన రష్మిక.. హృతిక్ ఒప్పుకున్నాడా ?
Rashmika Mandanna: రష్మిక మందన.. ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్. తన క్రేజ్ కూడా రోజురోజుకూ ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు ఆమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ప్రియాంక చోప్రా నటించిన క్రిష్ ఫ్రాంచైజీలో రష్మిక ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ 4లో రష్మిక హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మికకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. క్రిష్ 4 సినిమాతో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన క్రిష్, క్రిష్ 3 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక చోప్రా స్థానాన్ని రష్మిక భర్తీ చేయనున్నట్లు సమాచారం.
ఎందుకు రష్మికనే?
ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న క్రిష్ 4 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. దీనితో పాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉండటం వల్ల ఆమెకు బాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి సమయం దొరకడం లేదు. అందుకే సినిమా యూనిట్ కొత్త హీరోయిన్ కోసం చూసింది. ఈ క్రమంలో వారి దృష్టి రష్మిక మందనపై పడింది.
హృతిక్ రోషన్, రష్మిక మందన ఇంతవరకు ఏ సినిమాలో కలిసి నటించలేదు. అందుకే ఈ కొత్త కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఫ్రెష్ జోడీ కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ కాంబినేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.
బాలీవుడ్‌లో రష్మిక జోరు
పుష్ప, పుష్ప 2, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో రష్మిక మందన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ సినిమా అంతగా విజయం సాధించకపోయినా, రష్మికకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు వచ్చిన క్రిష్ 4 ఆఫర్ ఆమె కెరీర్‌కు మరో మైలేజ్ ఇస్తుందని చెప్పవచ్చు. అయితే, దీనిపై సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రష్మిక థమా అనే హిందీ సినిమాతో పాటు కాక్‌టెయిల్ 2, గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాల్లో నటిస్తోంది. హృతిక్ రోషన్ వంటి పెద్ద హీరోతో సినిమా చేస్తే ఆమె కెరీర్ మరింత ఊపందుకుంటుంది.