Kingdom Movie: ‘మనం కొట్టినం’.. 'కింగ్డమ్'పై రష్మిక పోస్ట్.. రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండ
Kingdom Movie: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన 'కింగ్డమ్' సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.
Kingdom Movie: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన 'కింగ్డమ్' సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుండటంతో, దీన్ని విజయ్ దేవరకొండకు భారీ హిట్‌గా అభివర్ణిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయనకి వచ్చిన ఈ విజయం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.
ఈ సందర్భంగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో హృద్యమైన ట్వీట్ చేశారు. ఆమె ట్విట్టర్‌లో – "మనం కొట్టినం", అంటూ విజయ్‌ను ఉద్దేశించి భావోద్వేగభరితంగా రాసింది. "ఈ చిత్రం నీకు, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ‘మనం కొట్టినం’... ‘కింగ్డమ్’ సక్సెస్ అయింది", అని పేర్కొంది.
రష్మిక ట్వీట్‌కు స్పందనగా, విజయ్ దేవరకొండ కూడా అదే పదాలతో, "మనం కొట్టినం" అంటూ హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్లతో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.