Rambha Family Car Accident: హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం
Actress Rambha: పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా ఘటన
Rambha Family Car Accident: హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం
Road Accident: ప్రముఖ నటి రంభ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నటి స్వల్ప గాయాలతో బయటపడగా.. ఆమె కుమార్తె మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రంభ సోషల్‌మీడియా వేదికగా తెలియజేస్తూ.. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం రంభ కుటుంబం కెనడాలో ఉంటోంది. రంభ.. తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకొని వస్తుండగా వీరి కారును మరో వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటనలో తామంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు నటి తెలిపింది. అయితే తన చిన్న కుమార్తె సాషా మాత్రం గాయాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పేర్కొంది. ప్రమాద సమయంలో కారులో రంభ, ఆమె పిల్లలు, ఒక ఆయా కూడా ఉన్నారు. కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.