Ramam Raghavam Trailer:రామం రాఘవం ట్రైలర్.. ఏడిపించేసిన ధన్ రాజ్, సముద్రఖని
జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ స్వీయ దర్శకత్వంతో నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం రామం రాఘవం. ఈ సినిమాలో ధన్ రాజ్, సముద్రఖని తండ్రీకొడుకులుగా నటించారు.
రామం రాఘవం ట్రైలర్.. ఏడిపించేసిన ధన్ రాజ్, సముద్రఖని
Ramam Raghavam Trailer: జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ స్వీయ దర్శకత్వంతో నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం రామం రాఘవం. ఈ సినిమాలో ధన్ రాజ్, సముద్రఖని తండ్రీకొడుకులుగా నటించారు. ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నాని రిలీజ్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తండ్రి, కొడుకుల మధ్య జరిగే సంఘర్షణే రామం రాఘవం.
కొడుకు సెటిల్ కాకుంటే.. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి రోజూ జరిగే తండ్రీ కొడుకుల వార్. కొడుకు వేస్ట్ అంటూ చెప్పే తండ్రి, తండ్రి తనను అర్థం చేసుకోవడం లేదంటూ కోప్పడే కొడుకు. ఇలా ట్రైలర్‌లో ఎమోషన్స్ బాగా పండించారు. మిడిల్ క్లాస్ ఫాదర్‌గా సముద్రఖని, కొడుకుగా ధన్ రాజ్ ట్రైలర్‌లో ఏడ్పించేశారు. తండ్రి మాట వినని కొడుకు, ఆయన మీద పంతంతో ఏ పనులు చేశాడు..? కొడుకు కోసం తండ్రి ఏం చేశాడు..? వీళ్లిద్దూ మళ్లీ కలిశారా..? అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. మోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మూవీ రూపొందుతున్న ఈ చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో రానుంది.
రామం రాఘవం ట్రైలర్‌ను హీరో నాని రిలీజ్ చేశారు. తన చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు నాని. ధన్ రాజ్ టాలెంట్ ఏంటో తనకు తెలుసునని.. అందుకే రామం రాఘవం సినిమాకి దర్శకత్వం వహించాడంటే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదన్నారు. ధన్ రాజ్ కామెడీ సినిమా తీస్తాడేమో అనుకున్నా.. ట్రైలర్ చూపించి ఎమోషన్ డ్రైవ్‌లోకి తీసుకెళ్లాడని అన్నాడు. సముద్రఖని అన్న వర్క్ అంటే వ్యక్తిగతంగా తనకు ఎంతో ఇష్టమన్నారు. సినిమాకు అరుణ్ చిలివేరు మంచి సంగీతాన్ని అందించారని.. ట్రైలర్ చూస్తేనే అర్థ అవుతుందన్నారు. టీమందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ 21వ తేదీ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు హీరో నాని.
ఫాదర్, సన్ ఎమోషనల్ డ్రామాలో ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నట్టు నటుడు, దర్శకుడు ధన్ రాజ్ అన్నారు. ఈ సినిమాను స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ అరిపాక సమర్పణలో నిర్మిస్తున్నారు. విమానం దర్శకుడు యానాల శివప్రసాద్ కథ అందించారు. సినిమాలో మోక్ష, హరీష్, ఉత్తమన్, వాసు ఇంటూరి, సత్య, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
జబర్దస్త్‌లో కమెడియన్‌గా ధన్ రాజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో నటించి మెప్పించారు. పిల్ల జమిందార్ సినిమాలో నాని స్నేహితుడిగా నటించారు. ఇన్ని రోజులు తన నటనతో ఎంటర్‌టైన్ చేసిన ధన్ రాజ్.. రామం రాఘవం సినిమాతో దర్శకుడిగా మారిపోరిపోయాడు. ఈ నెల 21న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమా ధన్‌రాజ్‌కు ఎలాంటి సక్సెస్‌ను ఇస్తుందో చూడాలి.