RAPO22: అదిరిన ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ గ్లింప్స్..!
RAPO22: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న 22వ సినిమా (#RAPO22) టైటిల్ అధికారికంగా ప్రకటించారు.
RAPO22: అదిరిన ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ గ్లింప్స్..!
RAPO22: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న 22వ సినిమా (#RAPO22) టైటిల్ అధికారికంగా ప్రకటించారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka) అనే టైటిల్‌తో సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ‘‘బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్’’ అన్న ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాలో రామ్ సాగర్ పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) మహాలక్ష్మి పాత్రలో ఆకట్టుకోనుంది. మరోవైపు, ప్రముఖ నటుడు ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. గ్లింప్స్ ఆధారంగా చూస్తే — సినిమాలో ఉపేంద్ర హీరోగా, రామ్ అతని అభిమాని పాత్రలో కనిపించనున్నట్టు స్పష్టమవుతోంది.
ఈ హై ఎనర్జీ న్యూ ఏజ్ స్టోరీ చిత్రానికి మహేశ్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో రామ్ చెప్పిన ‘‘ఆంధ్ర కింగ్ తాలూకా.. టికెట్టు ఇవ్వాల్సిందే’’ అనే డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. రామ్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా మీద ఆసక్తి పెరిగిపోతోంది.