Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లిరిక్స్ తో దూసుకుపోతున్న రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ 'నువ్వుంటే చాలే' 25 మిలియన్స్ క్రాస్
Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్.
Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి వివేక్ & మెర్విన్ సంగీతం అందించారు. ఫస్ట్ ట్రాక్ నువ్వుంటే చాలే ప్రోమోస్ పాట పై చాలా బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఇక ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే ట్రెండింగ్ అయింది కూడా. ఇక తాజాగా ఈ సాంగ్ 25 మిలియన్స్ వ్యూస్ సాధించింది.
ప్రేమకు హార్ట్ బీట్ ఉంటే అది 'నువ్వుంటే చాలే' లాగానే వుంటుంది. ఈ మెస్మరైజింగ్ సాంగ్ ఫస్ట్ నోట్ నుంచే మనల్ని అలరిస్తోంది. మ్యూజికల్ మ్యాజిక్, ఆర్కెస్ట్రేషన్, అకౌస్టిక్స్ అద్భుతంగా వున్నాయి. ఇది రిలీజ్ అయిన వెంటనే ఆల్-టైమ్ ఫేవరెట్ లవ్ సాంగ్స్ ప్లేలిస్టు లో చేరిపోయింది.
ఈ సాంగ్ కోసం రామ్ పోతినేని తొలిసారిగా లిరిక్ రైటర్ గా మారారు. నువ్వుంటే చాలే పాటలోని సాహిత్యం పోయెటిక్ గా వుంది. ప్రతి లైన్ మనసుని తాకేలా ఉందని విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక అద్భుతమైన రియల్ లోకేషన్స్ షూట్ చేసిన ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తున్నాయి. రామ్ చర్మిషా, భాగ్యశ్రీ ఎలిగెన్స్, కెమిస్ట్రీ ప్రేమని అనుభూతి చెందేలా చేసింది.
మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ తోనే బ్లాక్ బస్టర్ కొట్టారు మేకర్స్. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వుంటే చాలే పాట అదిరిపోయింది.
రామ్ పోతినేని బ్యూటిఫుల్ లిరిక్స్, అనిరుధ్ రవిచందర్ మెస్మరైజింగ్ వాయిస్, వివేక్ & మెర్విన్ సోల్ ఫుల్ కంపోజిషన్ తో సాంగ్ హ్యుజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తుండగా, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.