Ram Gopal Varma: విజయేంద్ర ప్రసాద్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆర్జీవి

Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు పుట్టినిల్లు.

Update: 2021-08-09 12:01 GMT

Ram Gopal Varma: విజయేంద్ర ప్రసాద్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆర్జీవి

Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు పుట్టినిల్లు. ఎప్పటికప్పుడు వివాదాస్పద కామెంట్లతో రామ్ గోపాల్ వర్మ న్యూస్ లోనే ఉంటారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి కె వి విజయేంద్ర ప్రసాద్ పై చేసిన షాకింగ్ కామెంట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. "బాహుబలి", "బజరంగీ భాయిజాన్" వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు స్క్రిప్టు అందించిన విజయేంద్రప్రసాద్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమాకి కూడా స్క్రిప్ట్ ను అందించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వర్మ విజయేంద్రప్రసాద్ గడ్డం గురించి కామెంట్లు చేశారు.

"మీరు ఎందుకు ఎప్పుడూ పెద్ద గడ్డంతో ఉంటారు? నరేంద్ర మోడీ మీకు ఇన్స్పిరేషనా? లేక రవీంద్రనాథ్ ఠాగూర్? వాల్మీకినా? లేక కావాలనే రాజమౌళిని ఓవర్టేక్ చేయడానికా?," అని రాంగోపాల్ వర్మ ప్రశ్నల బాణాలు సంధించారు. ఈ నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ గట్టిగా నవ్వేశారు. ఇక వర్మ గురించి మాట్లాడుతూ శివ, సత్య, రంగీలా వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు కనిపించడం లేదని ఇదివరకు అర్జీవీని తాను మిస్ అవుతున్నాను అని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News