Ram Charan: లండన్ కు మెగా ఫ్యామిలీ.. మేడమ్ టూస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు బొమ్మ

Update: 2025-05-06 04:34 GMT

 Ram Charan: లండన్ కు మెగా ఫ్యామిలీ.. మేడమ్ టూస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు బొమ్మ

Ram Charan: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా మంచిగుర్తింపు పొందారు రామచరణ్ తేజ. ఇప్పుడు ఈస్టార్ హీరోకు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని మే 9వ తేదీ ఆవిష్కరించనున్నారు. రామచరణ్ కు దక్కిన ఈ గౌరవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగా ఫ్యామిలీ లండన్ పయనమైంది. మెగాస్టార్ చిరంజీవితోపాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన దంపతులు, వారి కుమార్తె క్లన్ కారా లండన్ కు బయలుదేరారు.

రామ్ చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన ఫొటోషూట్ పూర్తి చేశారు. త్వరలోనే రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని టుస్సాడ్స్ టీమ్ గత ఏడాది జరిగిన ఐఫా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. దీనిపై గతంలో రామ్ చరణ్ స్పందించారు. టుస్సాడ్స్ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. చిన్నప్పుడు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం చూసినప్పుడు లెజెండ్స్ విగ్రహాలతో ఫొటోలు తీసుకునేవాడిని చెప్పారు. అయితే ఇలా ఒకరోజు అదే మ్యూజియంలో తన విగ్రహం ఏర్పాటు చేయడం..తన కెరీర్ లో తొలినాళ్లలోనే ఇలా జరగడం తాను ఊహించలేదన్నారు.

కాగా రామ్ చరణ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ కు చెందిన ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ లో ఇప్పటికే కొలువుదీరిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News