Ram Charan: పార్లమెంట్‌కు వెళ్లనున్న రామ్‌ చరణ్‌.. ఎందుకో తెలుసా.?

Ram Charan to Enter Indian Parliament Here is the Real Reason
x

Ram Charan: పార్లమెంట్‌కు వెళ్లనున్న రామ్‌ చరణ్‌.. ఎందుకో తెలుసా.?

Highlights

Ram Charan: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పార్లమెంట్‌లో అడుగు పెట్టనున్నారు. రామ్‌ చరణ్‌ ఏంటి.? పార్లమెంట్‌కి వెళ్లడం ఏంటని ఆలోచిస్తున్నారా.

Ram Charan: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పార్లమెంట్‌లో అడుగు పెట్టనున్నారు. రామ్‌ చరణ్‌ ఏంటి.? పార్లమెంట్‌కి వెళ్లడం ఏంటని ఆలోచిస్తున్నారా. మెగా పవర్‌ స్టార్‌ రాజకీయాల్లో ఎప్పుడు చేరారని అనుకుంటున్నారా? అయితే రామ్‌ చరణ్‌ సినిమా షూటింగ్ కోసం పార్లమెంట్‌కు వెళ్లనున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల కోసం త్వరలోనే చిత్రబృందం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను పార్లమెంట్ ఆవరణతో పాటు జామా మసీదు పరిసరాల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన అనుమతులను నిర్మాతలు ఇప్పటికే తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రామ్ చరణ్‌ సహా ఇతర నటీనటులు, సాంకేతిక బృందం ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఇదిలా ఉంటే భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ, ఇతర శివారు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ సినిమాను స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంత వరకు చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రామ్‌ చరణ్‌ తన కెరీర్‌లో ఇప్పటి వరకు కనిపించని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

2025లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ సినిమా టైటిల్‌ను రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీన ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వెంకట సతీష్ కిలారు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories