Ram Charan: ఏపీఎల్ టీమ్‌కు మెగా హీరో స్పెషల్ విషెస్… వైరల్ అవుతోన్న ‘పెద్ది’ క్రికెట్ షాట్!

ఏపీలో క్రికెట్ హంగామా మొదలైంది. ఇవాళ్టి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) నాలుగో సీజన్ ప్రారంభమై క్రికెట్ అభిమానులను అలరించనుంది.

Update: 2025-08-08 13:45 GMT

Ram Charan: ఏపీఎల్ టీమ్‌కు మెగా హీరో స్పెషల్ విషెస్… వైరల్ అవుతోన్న ‘పెద్ది’ క్రికెట్ షాట్!

ఏపీలో క్రికెట్ హంగామా మొదలైంది. ఇవాళ్టి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) నాలుగో సీజన్ ప్రారంభమై క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజయవాడ సన్ షైనర్స్ టీమ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, తన ‘పెద్ది’ సినిమాలోని క్రికెట్ షాట్‌ను రీక్రియేట్ చేస్తూ ఒక వీడియో పంచుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యంలో సన్ షైనర్స్ ఈ టోర్నీలో పోటీపడుతోంది. ఈ సీజన్‌లో మొత్తం ఏడు జట్లు తలపడనున్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. గ్రామీణ క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

గత ఏప్రిల్‌లో శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ‘పెద్ది’ మూవీ గ్లింప్స్‌లో రామ్ చరణ్ కొట్టిన యూనిక్ క్రికెట్ షాట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే షాట్ మళ్లీ ఏపీఎల్ సందర్భంగా హాట్ టాపిక్‌గా మారింది.



Tags:    

Similar News