Ram Charan: భూగోలాన్ని ఊపేస్తున్న చికిరి చికిరి పాట!

Ram Charan: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా అంచనాలు పెంచుతోంది.

Update: 2025-11-14 06:02 GMT

Ram Charan: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా అంచనాలు పెంచుతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి గ్లోబల్‌గా వైరల్ అవుతోంది. రీల్స్‌తో మ్యానియా సృష్టిస్తోంది.

రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది చిత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సంచలనం సృష్టించింది. భారతదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాలు, జపాన్, నేపాల్ వంటి ప్రాంతాల్లో ఈ పాట రీల్స్ వైరల్ అవుతున్నాయి. హుక్ స్టెప్‌పై సోషల్ మీడియా ఫీడ్ నిండిపోయింది. ఈ పాటకు రీచ్ అద్భుతంగా ఉంది. శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగ కూడా ఈ పాటతో రీల్ చేశాడు.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ ఆల్బమ్ మరింత ఆసక్తి పెంచుతోంది. వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మొత్తానికి చికిరి చికిరి మ్యానియా గ్లోబల్ లెవెల్‌లో కొనసాగుతోంది. ఈ పాటతో సినిమా ప్రమోషన్ మరింత బలపడింది.

Tags:    

Similar News