Ram Charan: రామ్ చరణ్ 'పెద్ది'కి బాలీవుడ్లో గట్టి పోటీ?

Ram Charan: రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2025-12-09 06:18 GMT

Ram Charan: రామ్ చరణ్ 'పెద్ది'కి బాలీవుడ్లో గట్టి పోటీ?

Ram Charan: రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే మార్చి నెలలో హిందీ మార్కెట్‌లో టాక్సిక్, ధమాల్ 4, ధురంధర్ 2 వంటి చిత్రాలతో గట్టి పోటీ ఎదురవుతోంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన చికిరి చికిరి పాట దేశమంతా సెన్సేషన్ సృష్టించింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే మార్చి నెలలో బాలీవుడ్లో పెద్దికి గట్టి పోటీ తప్పేలా లేదు. మార్చి 19న యశ్ టాక్సిక్, అజయ్ దేవగన్ ధమాల్ 4, రణవీర్ సింగ్ ధురంధర్ 2 విడుదల కానున్నాయి. ముఖ్యంగా టాక్సిక్‌పై ఉన్న క్రేజ్ గమనార్హం. ఈ మూడు చిత్రాల్లో ఏదైనా భారీ హిట్ అయితే పెద్ది ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. 

Tags:    

Similar News