Ram Charan: ప్రధాని మోడీని కలవనున్న రామ్‌చరణ్‌

Ram Charan: ఢిల్లీలో నటుడు రామ్‌చరణ్

Update: 2023-03-17 06:28 GMT

Ram Charan: ప్రధాని మోడీని కలవనున్న రామ్‌చరణ్‌

Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చకున్నారు రామ్ చరణ్. 95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అవార్డు వచ్చింది. ఈ వేడుక తర్వాత మూవీ టీమ్ అంతా హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఢిల్లీలో లాండ్ అయ్యారు. వేలాదిగా మెగా అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. ఆర్ఆర్ఆర్ బ్యానర్లు, చరణ్ ఫ్లెక్సీలు పట్టుకొని రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్ ప్రధాని మోడీను కలవనున్నారు.

Tags:    

Similar News