టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు మెగాపవర్ స్టార్ రాం చరణ్. ఆయన భార్య ఉపాసన అపోలో ఫౌండేషన్ నిర్వాహకురాలు అన్న విషయం తెలిసిందే. సోషల్ ఉపాసన మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. కుంటుంబంలో జరిగిన కార్యక్రమానతో సహా అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.
ప్రజలకు సాయం చేయడంలో ఉపాసన అందరికంటే ముందుగానే స్పందిస్తారు. సామాజిక బాధ్యత తీసుకోవడంలో ముందుంటారు. ఉపాసన ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ రిక్వెస్ట్ చేశారు. ఈ మధ్యే ప్రధాని కొత్త కార్యక్రమం తలపెట్టారు. తన సోషల్ మీడియా పేజీ సమాజంలో మార్పు తీసుకురావడానికి ఓ రోజు మహిళల చేతుల్లో పెడతానని అందుకు సలహాలు ఇవ్వాలని కోరాడు మోదీ.
దీనిపై ఉపాసన రిప్లై ఇచ్చారు. దేశాన్ని ఆరోగ్యకరమైన మార్చడానికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి సూచనలు అందించాలని ఉందని.. అందుకే మీ సోషల్ మీడియా ఖాతాను తనకు ఇవ్వాలని ట్విట్ చేసింది. ఉపాసన తనలో సామాజిక బాధ్యతను మరోసారి నిరూపించుకోడానికి ఈ పని చేశారు. మెగా కోడలు ఉపసనకు ఖాతాపేజ్ ఇవ్వాలి అభిమానులు కోరుకుంటున్నారు.
ఇటీవలే కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఒళ్లు నొప్పులు వస్తాయని తెలిపారు. ఈ వైరస్‌ను యాంటీ బయాటిక్స్ అంతమొందించలేవని స్పష్టం చేశారు. అందువల్ల డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి మందులు వేసుకోవద్దని ఉపాసన సూచించారు.
Dearest @narendramodi ji🙏🏼 pls give me a chance to express how we can make India a healthier nation.affordable, easy solutions to make r young population perform at their optimal level. I would like to project to the world how they can -HEAL IN INDIA 🙏🏼 Jai Hind #sheinspiresus https://t.co/IxgqVaEN98 pic.twitter.com/VyYt7cRUaJ
— Upasana Konidela (@upasanakonidela) March 3, 2020