Ram Charan: మేడం టుస్సాడ్‌లో చెర్రీ విగ్రహం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్లింకారా..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని మే 9న లండన్‌లోని ప్రఖ్యాత మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
Ram Charan: మేడం టుస్సాడ్‌లో చెర్రీ విగ్రహం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్లింకారా
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని మే 9న లండన్‌లోని ప్రఖ్యాత మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజీవి, సురేఖతో పాటు ఉపాసన కూతురు క్లింకారాతో కలిసి పాల్గొన్నారు.
ఇక రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని తన పెంపుడు శునకం రైమ్‌తో కలిసి రూపొందించారు. ఇలా పెంపుడు శునకంతో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న రెండో వ్యక్తిగా రామ్ చరణ్ అరుదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఈవెంట్‌లో ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
రామ్‌చరణ్, ఉపాసనల గారాల పట్టి క్లింకారా చేసిన ఓ పని అందరి హృదయాలను గెలుచుకుంది. ఉపాసన పిలుస్తున్నా, చిన్నారి క్లింకారా తన తండ్రి మైనపు విగ్రహం వైపు నడిచింది. విగ్రహం పక్కనే ఉన్న రామ్ చరణ్ కూతురును ఒడిలోకి తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆయన 2023 ఆస్కార్ వేడుకల్లో వేసుకున్న బ్లాక్ వెల్వెట్ బంధ్‌గాలా డ్రెస్సుతో తీర్చిదిద్దారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసేలా ఇది రూపొందించారు. అంతేకాకుండా, ఆయన పెంపుడు శునకం రైమ్‌కు కూడా స్థానం కల్పించారు. ఈ విగ్రహం మే 19 వరకు లండన్‌లో ప్రదర్శనలో ఉంటుంది. ఆ తర్వాత ఇది సింగపూర్ మేడం టుసాడ్‌కు తరలించనున్నారు.
ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన పెద్ది సినిమాలో నటిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026 మార్చిలో విడుదల చేయనున్నారు.