Ram Charan: కన్నడ స్టార్ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్...
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Ram Charan: కన్నడ స్టార్ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్...
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం కన్నడలోని ప్రముఖ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ ఒక సినిమా సైన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. "మఫ్టీ" అనే సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డైరెక్టర్ ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు అని పుకార్లు వినిపిస్తున్నాయి.
అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. "ఆర్ఆర్ఆర్" సినిమాతో రామ్ చరణ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్ లో ఓకే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ లో #ఆర్సి15 అనే ప్యాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ నర్తన్ దర్శకత్వంలో సినిమాని మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి "జెర్సీ" ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ ఒక సినిమాని చేయాల్సింది కానీ ఈ మధ్యనే రామ్ చరణ్ ఆ సినిమాని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నర్తన్ తో సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27 న విడుదల కాబోతున్నట్లు సమాచారం.