Ram Charan: ‘పెద్ది’ కోసం మున్నా భాయ్ ఎంట్రీ.. కొత్త షెడ్యూల్ ఎక్కడంటే?

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddhi) సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.

Update: 2025-05-22 10:06 GMT

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddhi) సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ పాన్-ఇండియా సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి దగ్గర ఒక భారీ గ్రామీణ సెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ కీలక షెడ్యూల్ కొనసాగుతోంది. ఇందులో హై-ఆక్టేన్ యాక్షన్ సీన్‌తో పాటు కొన్ని టాకీ సీన్లు చిత్రీకరిస్తున్నారు. గ్రామీణ వాతావరణాన్ని అత్యంత సహజంగా రీక్రియేట్ చేయడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

ఈ సినిమాలో మిర్జాపూర్ ఫేమ్ దివ్యేన్దు శర్మ (Munna Bhaiya) తన తొలి తెలుగు చిత్రంగా నటిస్తున్నాడు. రామ్ చరణ్, బుచ్చిబాబు, దివ్యేన్దుతో కలిసి తీసిన సెట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఆసక్తికరమైన క్యాస్టింగ్ ఉండగా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని ఆర్. రత్నవేలు, ఎడిటింగ్‌ను నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాశ్ కొల్లా నిర్వహిస్తున్నారు.

‘పెద్ది’ సినిమా 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోంది. క్రీడల ద్వారా సమాజాన్ని ఏకం చేసే యువకుడి కథ ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్‌గా నటిస్తున్నారు. ఆయన రగ్గడ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ ఆస్ట్రేలియాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News