Acharya Movie: వాయిదా పడనున్న ఆచార్య విడుదల
Acharya Movie: ఆచార్య సినిమాని వాయిదా వేయనున్న రామ్ చరణ్
ఆచార్య సినిమాని వాయిదా వేయనున్న రామ్ చరణ్(ఫైల్-ఫోటో)
Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే కూడా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.
కానీ ఈ సినిమా ఆ సమయానికి విడుదల అవుతుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే "సైరా నరసింహారెడ్డి" సినిమా మా కూడా భారీ అంచనాల మధ్య విడుదలైన అప్పటికీ ప్రమోషన్లు ఎక్కువగా చేయకపోవటం వల్ల సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది.
అందుకే "ఆచార్య" విషయంలో అలా జరగకూడదని రామ్ చరణ్ ఈ సినిమా కోసం ప్రమోషన్లు భారీగా చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే "ఆచార్య" సినిమా విడుదలను ఏప్రిల్ కి వాయిదా వేస్తే ప్రమోషన్ల కోసం ఎక్కువ సమయం కేటాయించచ్చు అనే ఉద్దేశంతోనే సినిమా విడుదల వాయిదా వేయనున్నారట. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.