Ram Charan: విరాట్ కోహ్లీ బయోపిక్ చేయాలని ఉంది అంటున్న మెగా హీరో
Ram Charan: అతని బయోపిక్ లో నటిస్తాను అంటున్నారు రామ్ చరణ్
Ram Charan: విరాట్ కోహ్లీ బయోపిక్ చేయాలని ఉంది అంటున్న మెగా హీరో
Ram Charan: "నాటు నాటు" పాటకి ఆస్కార్ కూడా అందడంతో ఇప్పుడు ప్రపంచమంతా మెగా హీరో రామ్ చరణ్ మరియు నందమూరి హీరో ఎన్టీఆర్ ల పేర్లు మారు్రోగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక బయోపిక్ లో నటించాలని ఉంది అని, అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పుకోచ్చాడు రామ్ చరణ్. భారతదేశపు క్రికెట్ టీం లోని స్టార్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ బయోపిక్ లో తనకి నటించాలని ఉంది అని అన్నారు రామ్ చరణ్.
ప్రస్తుతం రామ్ చరణ్ ఢిల్లీలో పలు ఇంటర్వ్యూ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉంది అని తన ఆసక్తిని చెప్పాడు చెర్రీ. ఆస్కార్ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రలు మరియు బాలీవుడ్ లో మాత్రమే కాక హాలీవుడ్ నుంచి కూడా రామ్ చరణ్ కి ఆఫర్లు వస్తున్నాయి. మరోవైపు రామ్ చరణ్ మాత్రం విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉంది అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు.
అయితే విరాట్ కోహ్లీ బయోపిక్ తీయాలని ఎప్పటినుంచో బాలీవుడ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అవకాశం వస్తే నటించడానికి తను రెడీ అని రామ్ చరణ్ చెప్పడంతో బాలీవుడ్ లో సినిమాని తీయాలి అనుకుంటున్న దర్శక నిర్మాతలు రామ్ చరణ్ మీద దృష్టి సారించి అవకాశం కూడా ఉంది. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా ఉన్నారు.