Ram Charan: 'పెద్ది' కోసం రామ్ చరణ్ మాస్ లుక్.. 'బీస్ట్ మోడ్ ఆన్' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన నటనతో ప్రపంచాన్ని మంత్రముగ్దం చేయడానికి సిద్ధమవుతున్నారు.
Ram Charan: 'పెద్ది' కోసం రామ్ చరణ్ మాస్ లుక్.. 'బీస్ట్ మోడ్ ఆన్' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన నటనతో ప్రపంచాన్ని మంత్రముగ్దం చేయడానికి సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ లో చెర్రీ ఓ రగ్డ్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం కోసం ఆయన చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
తాజాగా రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేస్తూ, "‘పెద్ది’ కోసం ఛేంజోవర్ ప్రారంభమైంది. స్వచ్ఛమైన ధైర్యం. నిజమైన ఆనందం" అనే క్యాప్షన్ జత చేశారు. ఆ ఫొటోలో చెర్రీ లాంగ్ హెయిర్‌తో పవర్‌ఫుల్ బాడీ బిల్డింగ్ లుక్‌లో బీస్ట్‌లా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేశారు.
మెగా ఫ్యాన్స్ మాత్రం ఆ ఫొటో చూసి “బీస్ట్ మోడ్ ఆన్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు.
ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. యాక్షన్ సన్నివేశాలకు నబకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నవాడు మరెవరో కాదు.. ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్.
ఈ మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
చెర్రీ ఫ్యాన్స్ కోసం ఇది ఒక పండుగే! ‘పెద్ది’ సినిమా నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.