Ram Charan: చెర్రీకి అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా గుర్తింపు..!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం లభించింది. ట్రిపులార్ మూవీతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించుకన్న చెర్రీకి ఇప్పుడు మరో అంతర్జాతీ గౌరవం లభించింది.
Ram Charan: చెర్రీకి అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా గుర్తింపు..!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం లభించింది. ట్రిపులార్ మూవీతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించుకన్న చెర్రీకి ఇప్పుడు మరో అంతర్జాతీ గౌరవం లభించింది. తాజాగా ఆయన లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరించారు.
రామ్ చరణ్‌తో పాటు ఆయన పెట్ డాగ్ ‘రైమ్’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్ మాజీ రాణి ఎలిజబెత్ తర్వాత, పెట్‌తో కలిసి మేడమ్ టుసాడ్స్‌లో స్థానం దక్కించుకున్న రెండవ సెలెబ్రిటీగా రామ్‌చరణ్ గుర్తింపు పొందారు. ఇది భారతీయ సినీ రంగానికి ఒక అరుదైన గౌరవం.
ఈ విగ్రహం ఆవిష్కరణ లండన్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేరు. అయితే తాజాగా పరిస్థితులు మాములు స్థితికి వస్తున్న నేపథ్యంలో ఈ గౌరవాన్ని అందరితో పంచుకోవాలని కుటుంబం నిర్ణయించింది.
రామ్‌చరణ్ విగ్రహం ఆయన 2023 ఆస్కార్ వేడుకకు ధరించిన బ్లాక్ వెల్వెట్ బంధ్‌గాలా డ్రెస్సులో ఉంది. ఈ విగ్రహం ఆయన ప్రపంచ స్థాయి విజయం, వ్యక్తిగత అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. తన కొడుకు సాధించిన ఘనతను చూసి తండ్రిగా గర్వించారని స్పష్టంగా చెప్పారు. రామ్‌చరణ్ తల్లి సురేఖ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ విగ్రహం లండన్ మేడమ్ టుసాడ్స్‌లో మే 19 వరకు ఉంటుంది. తర్వాత ఇది మేడమ్ టుసాడ్స్ సింగపూర్‌కు తరలించి అక్కడ ప్రదర్శించనున్నారు.