Rakul Preet Singh: మరొక సీనియర్ హీరో సినిమా సైన్ చేసిన రకుల్ ప్రీత్
Rakul Preet Singh: మరొక సీనియర్ హీరో సినిమా సైన్ చేసిన రకుల్ ప్రీత్
Rakul Preet Singh: మరొక సీనియర్ హీరో సినిమా సైన్ చేసిన రకుల్ ప్రీత్
Rakul Preet Singh: ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది. బాలీవుడ్లో "దే దే ప్యార్ దే" అనే సినిమాలో అజయ్ దేవగన్ సరసన హీరోయిన్గా నటించిన రకుల్ ప్రీత్ ఈ మధ్యనే "మన్మధుడు 2" సినిమా లో సీనియర్ హీరో నాగార్జున సరసన హీరోయిన్ గా కనిపించింది.
అయితే తాజా సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే "నేర్కొండ పార్వాయ్" సినిమాతో మంచి హిట్ అందుకున్న అజిత్ ఆ సినిమాకి దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ డైరెక్షన్లో ఇప్పుడు మరొక సినిమా చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అజిత్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంచుకున్నారు దర్శకనిర్మాతలు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. బోనీకపూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.